Vishwak-Sen-Response-on-Arjun-Sarja-Allegationsఒక సీనియర్ మోస్ట్ స్టార్ కం డైరెక్టర్ అప్ కమింగ్ హీరోని మీడియా సాక్షిగా నిందించడం అరుదుగా జరుగుతుంది. ఇలాంటి విభేదాలు గొడవలు బడా బ్యానర్లలోనూ సహజమే కానీ అవన్నీ రచ్చకెక్కిన సందర్భాలు లేవు. మహా అయితే ప్రైవేట్ పార్టీల్లో అఫ్ ది రికార్డు మాట్లాడుకోవడం తప్ప. నిన్న యాక్షన్ కింగ్ అర్జున్ విశ్వక్ సేన్ మీద చేసిన కామెంట్స్, తన ప్రొఫెషనలిజం మీద ఓపెన్ గా విమర్శించిన తీరు పెద్ద డిబేట్ కే దారి తీసింది. ఇవాళ ఒక చిన్న సినిమా టీజర్ లాంచ్ కు విచ్చేసిన విశ్వక్ దాని మీద పెదవి విప్పాడు.

సహజంగానే తన వైపు నుంచి డిఫెన్స్ చేసుకున్నట్టే మాట్లాడాడు. తనకు అర్జున్ ని అవమానించే ఉద్దేశమే లేదని, కేవలం కొన్ని సూచనలు సలహాలకు మాత్రమే చొరవగా చర్చించాను తప్ప ఆయనే సర్ది చెబుతూ ఇక్కడిదాకా తీసుకొచ్చారని వివరించాడు. ఉదయం అయిదు గంటలకు మెసేజ్ పంపడం గురించి కవర్ చేయబోయిన విశ్వక్ షూటింగ్ క్యాన్సిల్ కావడం సహజంగా జరుగుతుందని స్ట్రైకులు జరిగినప్పుడు, పక్కింటిలో ఏదైనా గొడవ ఉన్నా ఆపేసిన సందర్భాలు ఉన్నాయని అది పెద్ద ఇష్యూ కాదనే తరహాలో చెప్పడం ట్విస్టు.

విశ్వక్ చెప్పిన వెర్షన్ అటు పూర్తి కన్విన్సింగ్ గా లేక ఇటు తప్పని చెప్పలేని టైపులో సాగిపోయింది. పెద్ద ప్రొడ్యూసర్లతో ఎప్పుడూ ఇష్యూ రాలేదని చెప్పిన విశ్వక్ పదే పదే అర్జున్ మీద గౌరవాన్ని ప్రకటించడం గమనార్హం. తాను చాలా నిజాయితీగా ఉంటానని చెప్పిన విశ్వక్ ఏడాదికి ఆ కారణంగానే మూడు సినిమాలు చేయగలుగుతున్నట్టు చెప్పుకొచ్చాడు. తనకు బాడీ డబుల్ లేదని చాలా కష్టపడుతున్నానని
తన తప్పేమీ లేదని అపార్థమంతా అర్జున్ వైపే జరిగిందని ఇప్పటికీ అదే రెస్పెక్ట్ ఆయన మీద ఉంటుందని చెప్పాడు

సహజంగానే తను నటించే సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతానని అంతే తప్ప ఇంటర్ ఫియర్ అవ్వనని పబ్లిక్ గానే చెప్పిన విశ్వక్ మరి అర్జున్ అంతటి అనుభజ్ఞుడికి చెప్పాల్సిన అవసరం లేదని గుర్తించలేకపోతే ఇకపై యువ దర్శకులు స్వేచ్ఛగా చేయడానికి ఆలోచిస్తారుగా. విశ్వక్ సేన్ పుట్టిన ఏడాది కంటే ముందే 1994లో అర్జున్ జైహింద్ అనే భారీ బడ్జెట్ సూపర్ హిట్ సినిమాని డైరెక్ట్ చేసిన విషయం మర్చిపోకూడదు. ఏ మణిరత్నమో గౌతమ్ మీననో ఉంటే ఇలా చెప్పే సాహసం ఎవరైనా చేయగలరా.

మొత్తానికి తెల్లవారుఝామున మెసేజులు గురించి పెళ్లి ముహూర్తానికి అయిదు నిముషాల ముందు అబ్బాయి నాకీ పెళ్లి ఇష్టం లేదని చెప్పినట్టు కవర్ చేసిన తీరు ఆశ్చర్యపరిచింది. ఆ మధ్య పాగల్ దర్శకుడితో ధమ్కీ మొదలుపెట్టి తర్వాత అతన్ని తప్పించేసి తనే స్వయంగా డైరెక్షన్ కి పూనుకోవడం లాంటి ఉదంతాలు ఉన్నాయిగా. ఏది ఏమైనా విశ్వక్ లాంటి యువ హీరోలు మాది యంగ్ బ్లడ్, జనేరేషన్ మారిందని అడుగులు జాగ్రత్తగా వేయకపోతే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. అరటితొక్క మీద కాలేసి జారిపడితే తిట్టుకోవాల్సింది దాన్ని పడేసిన తిన్నవాడిని కాదు. జాగ్రత్తగా చూడని మన కాలుని కన్నుని