Piracy Website Tamilrockers Challenging Vishalతెలుగు అబ్బాయి అయిన‌ప్ప‌టికి ..అక్క‌డే పుట్టి పెర‌గ‌డంతో విశాల్ త‌మిళ్ ఇండ‌స్ట్రి ని పునాదిగా చేసుకునే త‌న న‌ట ప్ర‌యాణం కొన సాగిస్తున్నాడు. కేవ‌లం సినిమాల‌కే ప‌ర‌మితం అయితే విశాల్ గురించి ప్ర‌స్తుతం మాట్లాడుకోవాల‌సింది ఏమి లేదు. త‌ను సినిమాను పునాది గా చేసుకుని చాల చేయాల‌నుకుంటున్నాడు . త‌మిళ్ నాడు లో వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు..తుఫాను ప‌డి మ‌ద్రాసు న‌గ‌రం అంతా జ‌ల‌దిగ్భంధం అయిన‌ప్పుడు త‌న వంతు సేవ‌లు అందించాడు. కేవ‌లం త‌మిళియ‌న్స్ మాత్ర‌మే విజ‌యం సాధించే కోలీవుడ్ ఇండ‌స్ట్రికి చెందిన న‌డిగ‌ర్ సంగ‌మ్ ఎన్నిక‌ల్లో గెలిచి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచాడు. శ‌ర‌త్ కుమార్ తో ఢీ అండే ఢీ అని మ‌రి విజ‌య కేతనం ఎగుర వేశాడు. అంతే కాదు త‌మిళ సంప్ర‌దాయ క్రీడ `జ‌ల్లి క‌ట్టు` ను ర‌ద్దు చేయాల‌ని వివాదం న‌డిచిన స‌మ‌యంలోను .. జ‌ల్లు క‌ట్టు నిషేధం త‌గ‌దు అని తన వాయిస్ క్లియ‌ర్ గా వినిపించాడు. విష‌యం ఏదైనా..సూటిగా సుత్తి లేకుండా పందెం కోడి మాదిరే బ‌రిలోకి దిగ‌డం విశాల్ కు అల‌వాటు అన్న‌ట్లుగా చేస్తుంటాడు.

ఈ మ‌ధ్య రాజ‌కీయాల‌కు సంబంధించి ఏ విష‌య‌మైన విశాల్ దాప‌రికాలు లేకుండా వ్యాఖ్య‌నిస్తున్నాడు. ఆ మ‌ధ్య త‌మిళ్ హీరో విజ‌య్ న‌టించిన `మెర్సిల్ `చిత్రం రిలీజ్ అయిన స‌మ‌యంలో ఆచిత్రంలో జి ఎస్ టి కి సంబంధించి ఎవో కొన్ని సంభాష‌ణాలు చిత్రంలో ఉన్నాయ‌ని అవి త‌ను మెర్సిల్ చిత్రం పైర‌సి కాపిలో చూశాన‌ని ఒక బీజేపీ నాయ‌కుడు చెప్ప‌గా .. అత‌ని ఫేస్ మీద‌నే నాయ‌కుడు అయి వుండి పైర‌సి ని ఎలా చూస్తారు..? మీకు అస‌లు బుద్ది ..జ్ఞానం ఉందా? అన్నంత రేంజ్ లో క‌డిగి ప‌డేయ‌డంతో… విశాల్ పై వెంట‌నే ఐటి దాడులు జ‌రిగాయి. అయినా విశాల్ వెన‌క్కి త‌గ్గ‌లేదు.

అయితే విశాల్ పాలిటిక్స్ లో త‌న ప్ర‌స్థానం ఎంటో ప‌రీక్షించుకుందాన‌మే ఉద్దేశ్యంతో ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను అందుకు అదునుగా ఉప‌యోగించుకుందామ‌ని భావిస్తే.. ఎన్నిక‌ల సంఘం మాత్రం ఆర్ కే న‌గ‌ర్ నియోజ‌గ వ‌ర్గానికి విశాల్ వేసిన నామినేష‌న్ చెల్ల‌దంటూ ఝ‌ల‌క్ ఇచ్చింది. విశాల్‌ సమర్పించిన నామినేషన్‌ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయని, అందుకే తిరస్కరించామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్పష్టం చేశారు. 300 మంది అనుచరులతో కలిసి సోమవారం సాయంత్రం చివరి నిమిషంలో విశాల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆర్ కే న‌గ‌ర్ లో దాదాపు ల‌క్ష మంది తెలుగు ఓట‌ర్లు ఉన్నారు. విశాల్ పోటి చేస్తే తెలుగు వారి ఓట్లు తో పాటు.. ఇత‌ర వ‌ర్గాల వారి ఓట్లు త‌న‌కే ప‌డే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా రంగంలోకి దిగిన విశాల్ నామినేష‌న్ ను తిర‌స్క‌రించ‌డం విశాల్ కు నిజంగా ఊహించ‌ని ప‌రిణామం . దీని వెన‌క రాజ‌కీయ కుట్ర ఉంద‌నేది విశాల్ వాద‌న‌. ఏది ఏమైన‌ప్ప‌టికి విశాల్ ను ఇలా ఆదిలోనే అడ్డుకోవ‌డంతో ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య‌నే పోటి నెల‌కొంది. ఏఐఏడీఎంకే అభ్యర్థిగా మధుసూదన్‌, డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్‌, భాజపా అభ్యర్థిగా నాగరాజన్‌, ఏఐడీఏడీఎంకే బహిష్కృత నేత టిటివి దినకరన్‌ ప్రస్తుతం బరిలో ఉన్నారు.
జయలలిత మృతితో ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈనెల 21న ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది.