Vishal Reddy fires on mediaతమిళ యువ హీరో, నిర్మాత అయిన విశాల్ మీడియాను ఏకేశాడు. మీడియా రూమర్స్ స్ప్రెడ్ చెయ్యడం కామన్ కానీ, ఇలా వ్యక్తిగత జీవితాన్ని కూడా మీ ఇష్టం వచ్చినట్లు రాసేస్తారా అంటూ ట్విట్టర్ స్వార ఫైర్ అయ్యాడు. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే, విశాల్ ఒక హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే.

అయితే కొన్ని వెబ్సైట్ అయితే ఏకంగా ఆ అమ్మాయి ఫోటో ను కూడా పోస్ట్ చేసేశాయి. కట్ చేస్తే ఇప్పటివరకూ సైలెంట్ గా ఉన్న విశాల్ దీనిపై స్పందిస్తూ ఈ పోస్ట్ ను పెట్టిన వెబ్సైట్స్ పై విరుచుకు పడ్డాడు. వ్యక్తిగత జీవితాలపై ఆధారాలు లేకుండా ఇలా రాయడం తప్పని, వాళ్ళు పోస్ట్ చేసిన వాటికి ఆధారాలు చూపించమని అడిగాడు.

అయితే కధ అక్కడితో అయిపోతే రొటీన్ కానీ, ఇంత హడావిడిలో కూడా ఒక ట్విస్ట్ ఇచ్చాడు..అదేంటి అంటే ట్విట్టర్ ఆధారంగా స్పందిస్తూ తన పెళ్లి గురించి త్వరలోనే అందరికీ చెబుతాను అని చెప్పాడు. అంటే విశాల్ చెప్పిన మాటల ప్రకారం త్వరలోనే విశాల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడన్న మాట.