visakhapatnam mp mvv satyanarayana comments on pattabhiఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే దారుణంగా ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని టీడీపీ నాయకుడు తిట్టు తిట్టాడని భారీ కుట్రతో రాజకీయం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ ఆఫీస్ లోకి చొచ్చుకుపోయి మరీ అన్నీ ధ్వంసం చేశారు. దాన్ని ఇంకా పొడిగిస్తూ ఏవేవో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

ఇక తాజాగా విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. మీడియా ముందు ఆయన మాట్లాడిన విధానం, వాడిన పదజాలం ఇప్పుడు అతనికి ఇక్కట్లు తెచ్చిపెడుతుంది.

ఆయన మాట్లాడిన భాష , వాడిన పదజాలం విని అక్కడ ఉన్న మీడియా కూడా ముక్కుపై వేలు వేసుకుంది. నిజానికి ఒక నాయకుడు తమ పార్టీ అధినేతని తిట్టాడని చెప్తూ వారిని కూడా తిట్టడం అనేది ఒకే కానీ… అందరూ ఉండగా ఓ దుర్భాషలో తను కూడా మరో తిట్టు తిట్టడం దానికి కార్యకర్తలు క్లాప్స్ కొడుతూ అరవడం లాంటివి టివీలో చూసే జనాలకి అసలు వీళ్ళు నాయకులా ? వీళ్ళకా మనం ఓటు వేసి గెలిపించింది ? ఛి..ఛి. అనిపించేలా చేసింది.

ఏమైనా ఓ పదవిలో ఉన్న నాయకుడు ఇలాంటి తిట్టు తిట్టడం దానికి మిగతా వాళ్ళు వత్తాసు పలకుతూ అదేదో సినిమా డైలాగ్ అన్నట్టుగా క్లాప్ కొట్టడం ఏమిటో వారికే తెలియాలి. ఈ చెత్త మాటలతో టివీ ల ముందుకు వచ్చి వీళ్ళు సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు ? ఒకసారి ఆలోచించాలి.