Visakhapatnam bhogapuram airportఅమరావతిలో తెలుగుదేశం పార్టీ ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసిందంటూ వైసీపీ చేసిన హంగామా తెలియనిది కాదు. అయితే అలాంటివి మచ్చుకు కూడా ఏమీ లేవంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో, ‘ఇన్ సైడ్ ట్రేడింగ్’ అన్న మాటకు వైసీపీకి నాలుక కరుచుకోవాల్సి వచ్చింది. అప్పటినుండి సైలెంట్ గా ఉన్న ‘ఇన్ సైడ్ ట్రేడింగ్’ మళ్ళీ తెరపైకి వచ్చింది.

అయితే ఈ సారి అమరావతి గురించి కాదు, అలాగని తెలుగుదేశం పార్టీతో ముడిపడి లేదు. ఈ సారి ఇన్ సైడ్ ట్రేడింగ్ పదం అధికార వైసీపీ పార్టీకి సంబంధించి మీడియా వర్గాల వేదికగా కధనాలు ప్రసారం అవుతున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించిన భూములకు పరిహారం చెల్లించే విషయంలో అవకతవకలు జరిగాయన్నది ఈ ఆరోపణ.

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిమిత్తం నాటి తెలుగుదేశం ప్రభుత్వం తొలుత 5500 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి, తదుపరి దానిని 2200 ఎకరాలకు కుదించింది. టిడిపి ;హయాంలో కొంతమందికి పరిహారం అందించగా, ప్రభుత్వం మారిన తర్వాత లబ్ధిదారులకు చేరాల్సిన పరిహారం చేరడం లేదన్నది లేటెస్ట్ న్యూస్.

లబ్దిదారుల స్థానంలో వైసీపీ నేతల పేర్లు మరియు వారి బినామీ పేర్లు వచ్చి చేరుతున్నాయని ఈ కధనాల సారాంశం. అలాగే భోగాపురం చుట్టుప్రక్కల ఉన్న 350 ఎకరాల ప్రభుత్వ భూములలో గతంలో సేద్యం చేసే వారి పేర్లకు బదులు వైసీపీ వర్గాల పేర్లు మారిపోయానని, ఇందుకు వైసీపీ నేతలకు రెవిన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ప్రభుత్వ మార్పే తమ బ్రతుకులను ఛిద్రం చేసినట్లుగా ప్రస్తుతం రైతులు పేర్కొంటున్నారు. గతంలో 50 శాతం పరిహారం చెల్లించిన రైతులకు కూడా మిగిలిన పరిహారం అందకపోవడం అనేది విస్తుపోయే విషయంగా మారుతోంది. ‘ఇన్ సైడ్ ట్రేడింగ్’ పేరుతో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేద్దామని వైసీపీ ప్రయత్నం చేయగా, చివరకు అదే ‘ఇన్ సైడ్ ట్రేడింగ్’ వైసీపీ మెడకు చుట్టుకోవడం విశేషం.