visakha district Collectorateఆంధ్రప్రదేశ్ లో ఉచితాల కోసం అప్పుల వేట ముమ్మరం అయ్యింది. ఈ వేటని తాము స్థితిగతులు మార్చేస్తామన్న విశాఖపట్నంలో జగన్ ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కించడం విశేషం. అప్పుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ అంటూ పెట్టి గతంలో ఎన్నడూ లేనట్టుగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తేవడం విశేషం.

SBI, PNB, ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు మరియు బ్యాంకు అఫ్ బరోడా కి విశాఖలోని 213 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆస్థిని కుదువ పెట్టారు. కుదువ పెట్టిన ఆస్తులలో విశాఖ కలెక్టరేట్ కూడా ఉండటం విశేషం. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ఈ వారంలోనే పూర్తి చేశారట. వివిధ పథకాల కోసం 21,500 కోట్లు అప్పుగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం టార్గెట్.

ఇందుకోసం ప్రభుత్వం ఈ కార్పొరేషన్ కు గారంటీ ఇస్తుంది. అలాగే రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేసే పది డిపోల నుండి వచ్చే అదనపు సుంకం నేరుగా బ్యాంకులకు రుణ చెల్లింపుకు వెళ్తుంది. బ్యాంకులు అంతటితో సరిపెట్టకపోవడంతో తాజాగా 213 ఎకరాలను కుదువ పెట్టింది. ఆ మేరకు అక్కడ ఉన్న ప్రభుత్వ ఆస్తులతో సహా.

రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కారణం వాళ్ళ ఆ రుణాలను చెల్లించలేకపోతే ఆ ఆస్తులను వేలం వేసుకొనే వెసులుబాటును బ్యాంకులకు కల్పించినట్లు అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఏడాదికి అందుబాటులో ఉన్న రుణపరిమితి ఆగష్టు నాటికి నిండుకుంటుంది. ఏడాదిలో మిగిలి ఉన్న మిగతా ఏడు నెలలకు ఆస్తులు కుదవ పెట్టి అప్పులు చేస్తే గానే బండి ముందకు వెళ్ళదు.