Virat-Kohliఇంగ్లాండ్ వేదికగా జరిగిన గత టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయించుకున్న టీమిండియా, ఈ సారి ఎలాగైనా ఇంగ్లాండ్ కు షాక్ ఇవ్వాలని భావించింది. అయితే తొలి టెస్ట్ మ్యాచ్ మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు కేవలం 287 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా, బ్యాటింగ్ లో మాత్రం పేలవమైన ప్రదర్శన ఇచ్చింది.

కెప్టెన్ విరాట్ కోహ్లి తప్ప మిగతా వారెవరూ తమ స్థాయికి తగిన బ్యాటింగ్ ను ప్రదర్శించలేకపోయారు. ఓపెనింగ్ జోడి 50 పరుగులు జోడించిన తర్వాత వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఆ తర్వాత క్రమక్రమంగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఒకానొక తరుణంలో 182 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి, 200 పరుగులు కూడా చేరుతుందో లేదో అనుకున్న తరుణంలో విరాట్ కోహ్లి చెలరేగి ఆడాడు.

21 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్ ను ఒడిసి పట్టుకోవడంలో విఫలమైన మిలాన్, అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారు. కెరీర్ లో తన 22వ సెంచరీతో కదం తొక్కిన విరాట్ ఇంగ్లాండ్ సాధించిన పరుగులకు చేరువగా టీమిండియాను చేర్చడంలో సఫలమయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను తక్కువ స్కోర్ కు ఆలౌట్ చేస్తే తప్ప టీమిండియాకు విజయావకాశాలు కష్టం.