Virat Kohli World Recordsసెంచరీల మీద సెంచరీలు బాదుతూ సచిన్ పేరును మైమరపిస్తున్న విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియా తరపున వరుసగా ఎనిమిది సంవత్సరాల పాటు వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డులకెక్కాడు విరాట్. 2010వ సంవత్సరం నుండి ప్రారంభమైన విరాట్ ప్రస్థానం ఈ ఏడాది వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇలా వరుసగా ఎనిమిదేళ్ళ పాటు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలవడం సచిన్ కెరీర్ లో కూడా లేకపోవడం విశేషం.

2010లో 25 మ్యాచ్ లలో 995 పరుగులు, 2011లో 34 మ్యాచ్ లలో 1381 పరుగులు, 2012లో 17 మ్యాచ్ లలో 1026 పరుగులు, 2013లో 34 మ్యాచ్ లలో 1054 పరుగులు, 2015లో 20 మ్యాచ్ లలో 623 పరుగులు, 2016లో 10 మ్యాచ్ లలో 739 పరుగులు, 2017లో ఇప్పటివరకు 18 మ్యాచ్ లు ఆడిన కోహ్లి 1017 పరుగులు చేసాడు. ఈ ఎనిమిదేళ్ళల్లో 2012లో ఒకే ఏడాది అయిదు సెంచరీలు నమోదు చేయగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 4 సెంచరీలు చేసాడు. అయితే ఒక ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా సచిన్ (8) పేరుతోనే ఉంది.