Virat - kohli out in team india -vs england test match 2018-చేతిలో 5 వికెట్లు… విజయానికి 84 పరుగులు కావాల్సిన తరుణంలో క్రీజులోకి అడుగుపెట్టిన టీమిండియా బ్యాట్స్ మెన్లు, విజయానికి ఇంకా 31 పరుగుల దూరంలో ఉండగానే పెవిలియన్ కు చేరుకున్నారు. దీంతో తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆదిత్య ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి, 5 మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

టీమిండియా చేతిలో 5 వికెట్లు ఉన్నా, వారికి కావాల్సింది ఒక్క విరాట్ కోహ్లి వికెట్ మాత్రమే కావడంతో, అది దక్కగానే ఇండియా పరాజయం ఖరారయ్యింది. నాలుగవ ఆట ప్రారంభమైన తొలి ఓవర్లోనే దినేష్ కార్తీక్ పెవిలియన్ చేరుకోగా, అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీజులో తడబడ్డాడు.

ఈ తరుణంలో బెన్ స్టోక్స్ కు బాల్ ఇచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ కు తను వేసిన మూడవ బంతితోనే విజయాన్ని దాదాపుగా ఖరారు చేసాడు. బెన్ స్టోక్స్ వేసిన ఇన్ స్వింగ్ బంతిని అంచనా వేయలేకపోయిన కోహ్లి, వికెట్ల ముందు దొరికిపోయి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అదే ఓవర్ లో షమీ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన ఇషాంత్ శర్మ రెండు ఫోర్లు కొట్టి కాసేపు మురిపించినా, ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరో ఎండ్ లో ఉండి చూస్తున్న హిట్టర్ హార్దిక్ పాండ్య అయినా అద్భుతం సృష్టిస్తాడని భావించిన టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురుకావడంతో, 162 పరుగులకే టీమిండియా చాపచుట్టేసింది. ఈ మ్యాచ్ లో ఒక్క విరాట్ కోహ్లి తప్ప బ్యాట్స్ మెన్లంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు.