vIRAT Kohli comes in as a water boyఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మూడు మ్యాచ్ ల వరకు టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లి, నాలుగవ టెస్ట్ మ్యాచ్ కు మాత్రం ‘వాటర్ బాయ్’గా మారిపోయాడు. అవును… భుజం గాయం కారణంగా చివరి టెస్ట్ మ్యాచ్ నుండి తప్పుకున్న విరాట్ కోహ్లి, తన టీం మెంబర్లకు దగ్గరగా ఉండేందుకు వాటర్ బాయ్ గా మారిపోయి, తన సహచరులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నాడు.

అయితే ఇందులో కూడా ఓ మతలబు ఉందిలేండి. ఇలా వాటర్ బాటిల్స్ తీసుకువస్తూ, కొత్తగా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన అజెంకా రెహానేకు సలహాలు ఇవ్వవచ్చు. టీంలోకి రాకముందు ఇలా వాటర్ బాటిల్స్ తీసుకురావడం సహజమే గానీ, ఇలా కెప్టెన్ స్థాయికి ఎదిగిన తర్వాత వాటర్ బాటిల్స్ ను తీసుకురావడం బహు అరుదుగా జరిగే విషయం. 5వ ఓవర్లోనే బాల్ మార్చిన సందర్భంగా కోహ్లి ఇలా వాటర్ బాటిల్స్ తో దర్శనమిచ్చాడు.

ఇక, కొత్తగా కెప్టెన్సీ చేపట్టిన రెహానేకు మ్యాచ్ ఫస్ట్ బంతిలోనే ‘గోల్డెన్’ ఆపర్చునిటీ చేజారిపోయిందని చెప్పాలి. భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని డేవిడ్ వార్నర్ డ్రైవ్ చేయగా, స్లిప్ లో ఉన్న కరుణ్ నాయర్ ఆ క్యాచ్ ను పట్టుకోవడంలో విఫలమయ్యాడు. మ్యాచ్ ఫస్ట్ బంతికే వార్నర్ ను అవుట్ చేసే అవకాశం దక్కినా, నాయర్ ఫీల్డింగ్ ప్రతిభతో పట్టు సడలింది. అయితే రెండవ ఓవర్ లోనే ఉమేష్ మరో ఓపెనర్ రైన్ షాను పెవిలియన్ పంపాడు.