viral yscp 3000 crores cheatingఆంధ్రప్రదేశ్ కు 3000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఎంపీ విజయసాయిరెడ్డి బలంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. రాబోయే మూడు నెలల్లో ఈ 3000 కోట్లతో రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందన్న చందంగా వైసీపీ అండ్ కో చేసిన ప్రచారాన్ని సోషల్ మీడియా జనులు బయట పెడుతున్నారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి ఒప్పందం కుదుర్చున్న కంపెనీ ఏంటి? దాని గత చరిత్ర ఏంటి? అందులో ఎంత మంది ఉద్యోగస్తులు ఉన్నారు? 3000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది అంటే ప్రస్తుతం ఎంత టర్నోవర్ ఆ కంపెనీ చేస్తోంది? అన్న ప్రశ్నలను వెతకగా, దానికి నివ్వెరబోయే సమాధానాలు వెలుగు చూసాయి.

కాజాస్ ఈ మొబిలిటీ అనే కంపెనీతో మేకపాటి 3000 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకోగా, ఆ కంపెనీ కేవలం 9 నెలల క్రితం ఒక లక్ష రూపాయల పెట్టుబడితో స్థాపించిందినదిగా తేలింది. అలాగే ఆ కంపెనీ డైరెక్టర్ మినహా ఇతర ఉద్యోగస్తులు ఎవరు లేరని లింక్డ్ ఇన్ లో సమాచారం వచ్చింది.

ఇక ఫ్లాష్ బ్యాక్ విషయానికి వస్తే కాజాస్ కంపెనీ డైరెక్టర్ మారుదురు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ కు ఉన్న మరో కంపెనీ ఆర్తీక్ ఫైనాన్సియల్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లో 25 సంవత్సరాల క్రితం విజయసాయిరెడ్డి ఉద్యోగం చేసారట.

ఇలా గత త్రవ్వకాలన్నింటిని నెటిజన్లు గూగుల్ లో శోధించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అవుతోంది. మొత్తమ్మీద వైసీపీ సర్కార్ ప్రచారం చేస్తోన్న 3000 కోట్ల పెట్టుబడులు కేవలం ఓ ఫేక్ ప్రచారంగా నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు.