శుక్రవారం నాడు అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యిందన్న విషయం ట్విట్టర్ ట్రెండింగ్ చెప్పకనే చెప్తోంది. హ్యాష్ ట్యాగ్ చంద్రబాబు నాయుడుతో శుక్రవారం నాడు మొదలైన ఉధృతి శనివారం కూడా కొనసాగడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా, చంద్రబాబు కన్నీటిని తట్టుకోలేక కార్యకర్తలు అభిమానులు ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు తమ నిరసనలను తెలియజేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యకు పాల్పడగా, చాలామంది సోషల్ మీడియాలలో ఉద్వేగభరితమైన పోస్ట్ లను పెట్టారు.

ఈ క్రమంలో ఓ పెద్దాయన స్పందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీవీలో జగన్ కనపడుతున్న సమయంలో చెప్పు తీసుకుని టీవీని తెగ బాదేసారు. ఈ పెద్దాయన స్పందనకు పక్కన ఉన్న మహిళలు కూడా ఫక్కున నవ్వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది.

ఇంతగా సర్క్యులేట్ అవుతోన్న ఈ వీడియోలో ఉన్న పెద్దాయన పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న కూడా ఈ సందర్భంగా ఉత్పన్నం కాకుండా మానదు. గత రెండేళ్లుగా వైసీపీకున్న ఫ్లాష్ బ్యాక్ అలాంటిది మరి!