జిల్లాకో ఎయిర్ పోర్ట్ అంటూ ఇటీవల ఏపీ సీఎం చేసిన ప్రకటనలు సోషల్ మీడియాను సునామీ తాకినట్టు తాకాయి. సీఎం ప్రకటన వచ్చిన నాటి నుండి ఈ అంశంపై సోషల్ మీడియాలో వ్యక్తమైన మేమ్స్ కు కొదవలేదు. ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా కిలోమీటర్ రోడ్డు కూడా గుంతలు లేకుండా ఉన్న దుస్థితికి, ఇపుడు ఏకంగా విమానాశ్రయాలు అంటూ సీఎం చేసిన ప్రకటన 2022లో అత్యంత హాస్యాస్పదనమైన అంశంగా మారిపోయింది.

ఇప్పటికే నెటిజన్లు తమ సృజనాత్మకతతో అనేక విధాలుగా ఈ అంశంపై కామెడీని పంచారు. తాజాగా ‘కోనసీమ ఎయిర్ లైన్స్’ పేరుతో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బస్సు కండక్టర్ మాదిరి విమానం నుండి ఓ వ్యక్తి పిలిచే విధంగా ఉండడం, దానికి కొనసాగింపుగా ఏపీలోని రోడ్లను చూపించడం… మొత్తంగా ఈ వీడియో వీక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది.

నిజం చెప్పాలంటే ఏపీకి సిగ్గుచేటుగా పరిగణించాల్సిన విషయం, ప్రస్తుతం కామెడీగా మారిపోయింది. “మింగడానికి మెతుకు లేదు గానీ, మీసాలకు సంపెంగ నూనె” అన్న చందంగా ఈ ఎయిర్ లైన్స్ ప్రకటన ఉంది. అంతగా వైరల్ అవుతోన్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

https://twitter.com/BeingMcking_/status/1485586008984862721