Hero Sivaji - TV9 Ravi Prakash-తమ పైన కక్ష్య గట్టి కొన్ని మీడియా ఛానల్స్ ప్రవర్తిస్తున్నాయంటూ జనసేన వర్గం ఇటీవల చేసిన ఆరోపణలు తెలిసిందే. పవన్ అయితే ఏకంగా బ్యాన్ చేసేయండి అంటూ పిలుపునిచ్చాడు. ఈ ఆరోపణల వెల్లువ ఎలా ఉన్నా, ప్రస్తుతం ఆ వివాదం సర్దుమనగడంతో అంతా మామూలుగా ఉంది. ఇది జరగడానికి కొన్ని రోజుల ముందు ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో హీరో శివాజీ బిజెపి స్కెచ్ ఇదంటూ వైసీపీ + జనసేనలను టార్గెట్ చేసిన వైనం తెలిసిందే.

నాడు పవన్ పిలుపునిచ్చిన టీవీ9 రవిప్రకాష్ మరియు ఆపరేషన్ గరుడను తెరపైకి తీసుకువచ్చిన హీరో శివాజీలు కలిసి ఉన్న ఫోటోలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వీరిద్దరితో ‘జనసేన’ అనుబంధం కూడా ముడిపడి ఉండడంతో, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. న్యూయార్క్ లో ఏ సందర్భంలో కలిసారో గానీ, గతంలో జనసేన చేసిన ఆరోపణలకు ఈ ఫోటోలు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఒక్క జనసేనకే కాదు వైసీపీ అండ్ బిజెపి వర్గాలకు కూడా ఈ ఫోటోలు ఆహరంలా మారాయి.
Hero Sivaji - TV9 Ravi Prakash