Vinod-Khanna-diedప్రముఖ బాలీవుడ్ హీరో, గ్లామర్ ప్రపంచానికి మన్మధుడు మరియు నిర్మాతగా రాణించిన వినోద్ ఖన్నా ముంబైలో తుది శ్వాస విడిచారు. 70 సంవత్సరాల వినోద్ ఖన్నా, గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా, ఆ వ్యాధి మరింతగా పెరిగి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం 141 చిత్రాల్లో నటించిన ఆయన, పలు చిత్రాలను స్వయంగా నిర్మించారు.

ఇటీవల పూర్తి బక్కచిక్కిన శరీరంతో ఉన్న ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 2014లో గురుదాస్ పూర్ నుంచి వినోద్ ఖన్నా గెలిచి పార్లమెంటులో కూడా అడుగుపెట్టారు. వినోద్ ఖన్నా మృతిపై పలువురు ప్రముఖులు, బాలీవుడ్ వర్గాలు సంతాపం తెలుపుతున్నాయి. కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన వినోద్ ఖన్నా ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.