vinaya vidheya rama trp ratingsమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ యొక్క ఇప్పటివరకూ టెలివిజన్‌లో పది సార్లు టెలికాస్ట్ అయి ఉండవచ్చు. బాక్సాఫీస్ వద్ద పెద్ద అపజయం పొందిన ఈ చిత్రం టెలివిజన్‌లో మంచి రేటింగ్స్ నమోదు చేస్తూనే ఉంది. ఈ చిత్రం గత వారం జెమిని టివిలో ప్రసారం చేయబడింది మరియు దీనికి 7.5 టివిఆర్ రేటింగ్స్ లభించాయి.

అదే వారంలో వరల్డ్‌వైడ్ టెలివిజన్ ప్రీమియర్‌ను కలిగి ఉన్న వెంకీ మామా కేవలం 9.8 టీవీఆర్ రేటింగ్స్‌ను పొందింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే…. ఈ చిత్రం ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన ప్రతీ సారీ ఐదు కంటే ఎక్కువ టీవీఆర్ రేటింగ్స్ పొందడం విశేషం. వినయ విధేయ రామకు బోయపాటి శ్రీను దర్శకుడు.

డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ రామ్ చరణ్ తో రొమాన్స్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అలాగే రామ్ చరణ్ చిరంజీవి ఆచార్యలో ఒక కీలకమైన గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలయ్యాకనే ఆచార్యలో రామ్ చరణ్ ఎప్పుడు పాల్గొంటాడు అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతి విడుదల కావాల్సి ఉండగా…. ఈ బ్రేక్ కారణంగా అది వచ్చే ఏడాది జులైకి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి.