Vinaya-Vidheya-Rama train scene removedవినయ విధేయ రామ సినిమా విషయంలో అభిమానులు కాస్త నిరాశ చెందిన విషయం తెలిసిందే. అయితే బోయపాటి తన కెరీర్ లోనే అత్యంత దారుణంగా సినిమా తీసాడు అని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. మరో పక్క ఈ సినిమాలో కొన్ని సీన్స్ మరీ అతిగా ఉన్నాయి అన్న విమర్శలు సోషల్ మీడియాలో బలంగా వినిపించగా…

అందులో ముఖ్యమైన సీన్ ట్రైన్ పై హీరో బీహార్ వెళ్లే సీన్ ను తీసేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సీన్ ను గతంలో బాల కృష్ణ సినిమాలో కొన్ని ట్రైన్ సీన్స్ తో పోల్చుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉండడంతో ఈ సీన్ ను కట్ చేసినట్లు సమాచారం.

ఇక ఈ సీన్ మాత్రమే కాకుండా, పాము విలన్ ని కరిచి పామే చచ్చిపోయే సీన్, మరో పక్క హీరో విలన్స్ తలలు నరికితే గద్దలు ఎత్తుకు వెళ్లే సీన్, ఇలా చాలా సీన్ సినిమాపై విమర్శలకు దారి తీశాయి. కానీ ఇప్పటికే ఆ ట్రైన్ సీన్ ను మాత్రమే తొలగించినట్లు తెలుస్తుంది.

మొత్తంగా చూసుకుంటే వినయ విధేయ రామ సినిమా అభిమానుల అంచనాలను
తారు మారు చేసింది అని చెప్పక తప్పదు.