Vinaya Vidheya Rama to be dubbed in tamilఅసలే పరువు పోయి ఏడుస్తుంటే…మళ్ళీ కొత్తగా మరొకచోటకు వెళ్లి అక్కడ కూడా పరువు పోగొట్టుకోవాల్సిందేనా? ఇదేం ఆలోచన? ఏంటి ఈ కన్ఫ్యూషన్ అంటారా…ఒక్కసారి ఈ స్టోరీ చదవండి మీకే అర్ధం అవుతుంది.

మ్యాటర్ ఏంటి అంటే సంక్రాంతి ఫేవరెట్ గా బరిలో నిలిచిన రాంచరణ్ వినయ విధేయ రామ సినిమా ఇక్కడ ఎలాంటి డిజాస్టర్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఈ సినిమా చెర్రీ ఎందుకు ఒప్పుకున్నాడా అని ఫాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇక షరా మామూలుగా యాంటీ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

అయితే అయిపోయిందేదో అయిపోయింది సినిమా పరిశ్రమలో ఇవన్నీ మామూలే హిట్స్ …ఫ్లాప్స్ అలానే వస్తూ ఉంటాయి అని ఫాన్స్ ఈ సినిమా గురించి మరచిపోదాం అని అనుకునే లోపే…మరో పిడుగులాంటి వార్త ఇప్పుడు మెగా ఫాన్స్ ని కలవరపెడుతుంది. అదేంటి అంటే టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం ఈ సినిమాని వచ్చే నెల మొదటి వారంలో తమిళంలో రిలీజ్ చేస్తున్నారట. ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాకా ముందే తమిళ డబ్బింగ్ రైట్స్ అమ్మేసారట.

కట్ చేస్తే అసలే తమిళ వాళ్ళకి ఇలాంటి రొట్ట కొట్టుడు నచ్చదు. మరి ఈ క్రమంలో ఈ సినిమా అక్కడ రిలీజ్ అంటే తలచుకుంటేనే భయంకరంగా ఉంది అంటున్నారు మెగా ఫాన్స్.

మరి ఇక్కడ డిజాస్టర్ అయిన సినిమా అక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం.