Vinaya Vidheya Rama- public talkసంక్రాంతి అంటేనే సినిమాల పండగ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ పండగ తారా స్థాయిలో ఉంటుంది. అయితే సంక్రాంతి బరిలో అటు నందమూరి సినిమా…ఇటు మెగా ఫామిలీ నిలిచినప్పుడే ఆ పండగకి మంచి కిక్ వస్తుంది ..ఇదిలా ఉంటే గతంలో చాలా సార్లు అటు బాలయ్య, ఇటు చిరు ఇద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడి తమదైన శైలిలో అలరించారు.

అయితే గత ఏడాది..ఈ ఏడాది కూడా బాలయ్య సినిమాతో పాటు మెగా హీరోల్లో ఎవరో ఒకరు సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇక అంతక ముందు ఏడాది తీసుకుంటే అటు చిరు ఖైదీ 150 తో, ఇటు బాలయ్య శాతకర్ణితో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు.

కానీ గత ఏడాది త్రివిక్రమ్ ‘శ్రీనివాస్’ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన పవన్ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడి పోయింది. ఇక నేడు బోయ పాటి ‘శ్రీనివాస్’ దర్శకత్వంలో వినయ విధేయ రామ సైతం అభిమానులను నిరాశ పరిచింది అని చెప్పక తప్పదు.

అయితే ఇక్కడ కొస మెరుపు ఏంటి అంటే గత ఏడాది పవన్ తో బాలయ్య పోటీ పడి హిట్ అందుకున్నాడు..ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ తో మరో హిట్ సొంతం చేసుకున్నాడు..కానీ ఇద్దరు బడా దర్శకులను నమ్మిన మెగా ఫామిలీ మాత్రం ఫ్లాప్స్ ని మూటగట్టుకుంది.