టీజర్ టాక్ – ఇట్స్ రామ్… రామ్ కొ..ణి..ద..ల..!

Vinaya Vidheya Rama movieTeaser talk‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న “వినయ విధేయ రామ”పై అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని మరింత రెట్టింపు చేసే విధంగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 48 సెకన్ల పాటు సాగిన ఈ టీజర్ లో బోయపాటి – చరణ్ ల మాస్ యాంగిల్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ గా మారింది.

ముఖ్యంగా టీజర్ నడుమ వచ్చే “పందెం పరశురాం అయితే ఏంటిరా… ఇక్కడ రామ్… రామ్ కొ..ణి..ద..ల…” అంటూ చెర్రీ పలికిన విధానం…. చూపించిన అగ్రెసివ్ యాటిట్యూడ్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే చెర్రీ డైలాగ్ డిక్షన్ ఈ టీజర్ కు ఉన్న ప్రధాన హైలైట్. ఇలాంటి మాస్ ఎంటర్టైనర్స్ కు మాంచి ఊపున్న బ్యాక్ గ్రౌండ్ ఇవ్వడంలో దిట్ట దేవి.

అయితే ఈ రొటీన్ కమర్షియల్ మాస్ ఫ్లిక్ ఇష్టపడని వారు కూడా ఉండొచ్చు గానీ, ఓవరాల్ గా “వినయ విధేయ రామ” టీజర్ కావాల్సిన హైప్ ను అయితే పుష్కలంగా తీసుకువచ్చింది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు చెర్రీ సోదరులుగా నటిస్తున్నారని ఈ టీజర్ లోని షాట్స్ స్పష్టం చేసాయి. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

Follow @mirchi9 for more User Comments
Now, Lakshmi's NTR's Release Depends on it?Don't MissNow, Lakshmi's NTR's Release Depends on it?As a filmmaker, RGV is trying his best to get an appropriate and viable release...Don't MissYSR Congress Fearing Pawan Kalyan's Threat?YS Jagan Mohan Reddy strictly believes that it was Pawan Kalyan's Support to Chandrababu Naidu...Bigg Boss: Nani Couldn't, Who Can Fill Jr NTR's Shoes?Don't MissNani Couldn't, Who Can Fill NTR's Shoes?It's clear that NTR is going to focus only on his upcoming biggest movie till...Allu Arjun Switches on to Fitness ModeDon't MissAllu Arjun Switches on to Fitness Mode'All is well when it ends well'. This is a popular quotation in English that...Airaa Movie Trailer TalkDon't MissTrailer Talk: Compelling Horror by the Lady SuperstarThe upcoming film of the south Indian Lady Superstar, Airaa is already carrying a great...
Mirchi9