Vinaya - Vidheya Rama movieTeaser 10 million views“వినయ విధేయ రామ” అంటూ వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అశేష అభిమాన లోకం నీరాజనాలు పలికింది. ఈ మాస్ మెగా టీజర్ కు సోషల్ మీడియాలో ఉధృతమైన స్థాయిలో క్లిక్స్ వెల్లువ వచ్చి పడింది. శుక్రవారం నాడు ఉదయం 10.25 నిముషాలకు రిలీజైన ఈ టీజర్ 13 గంటలు ముగిసే సమయానికి 10 మిలియన్స్ క్లిక్స్ పడ్డాయంటే, ఏ రేంజ్ లో అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

యూ ట్యూబ్ లో 5.2 మిలియన్స్ కు పైగా సొంతం చేసుకున్న ఈ టీజర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ తదితర మాధ్యమాలలో కలిపి మొత్తంగా మొదటి 13 గంటలకు 10 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో వస్తాయని బహుశా చిత్ర యూనిట్ అంచనా వేసిందో లేదో గానీ, ఈ స్పందనకు డివివి దానయ్య ఫిదా అయ్యుంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఒరవడి అంతకంతకూ దూసుకుపోతుండడం విశేషం.

మెగా అభిమానులు మళ్ళీ మళ్ళీ చూసేలా ‘రామ్…. రామ్ కొ.ణి.ద.ల.’ అంటూ డైలాగ్ వేసిన చెర్రీని చూసి ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజులు రికార్డులు బద్దలయ్యే సూచనలను ఈ టీజర్ కలిగించింది. రాబోయే కాలంలో ప్రమోషన్ ఇదే రేంజ్ లో ఉండి, ధియేటిరికల్ ట్రైలర్ కూడా అదరగోడితే, ‘రంగస్థలం’ రికార్డులను చెర్రీ సొంతం చేసుకోవడం కష్టసాధ్యమేమీ కాకపోవచ్చు.