Vinaya-Vidheya-Rama-good collections instead of bad reviewsదొరక్క దొరక్క మెగా ఫామిలీ బడా హీరో ఛాన్స్ దొరికింది..అసలు ఎలా చూపించాలి…దంచి కొట్టి, కుమ్మి వదిలి పెట్టాలి. కానీ బోయపాటి ఆ అవకాశాన్ని పూర్తిగా వేస్ట్ చేసుకున్నాడు అనే చెప్పాలి. అయితే సినిమా పోయిన తర్వాత ఎందుకు ఇంత హంగామా అంటే, బోయపాటి కాస్త శ్రద్ద పెట్టి ఉంటే, సినిమా ఇంకో రకంగా ఉండేది అని..ఎలా అంటారా..

మాస్ సినిమా అంటే ప్రేక్షకులు ఎలా ఉన్నా, ఓ మోస్తరుగా ఆదరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిగిలిన సినిమాలతో పోల్చి చూస్తే మాస్ సినిమాకి ఉన్న అడ్వాంటేజ్ అదే. ఇప్పుడు వినయ విధేయ రామ విషయంలో కూడా జరిగింది అదే. వినయ విధేయ రామ సినిమా ఫస్ట్ డే టాక్ చూసి అయిపోయారు అనుకున్నారు అందరూ.

కానీ కట్ చేస్తే సంక్రాతి బరిలో నిలవడం వల్ల, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఓకే అన్నట్లుగా వసూళ్లు సాధించింది. పండగ మూడు రోజులు కలిపి, వీకెండ్ కూడా కలసి రావడంతో దాదాపుగా ఈ అయిదు రోజుల్లో యాభై కోట్ల షేర్ వరకూ రాబట్టి డిజాస్టర్స్ లోనే బెస్ట్ అనిపంచుకునేలా ఉంది.

అయితే ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే ఇరవై అయిదు కోట్ల వరకూ వసూళ్లు వచ్చాయి…కట్ చేస్తే మిగిలిన నాలుగు రోజులు కలిపి ఇరవై అయిదు కోట్ల షేర్ రావడం గమనార్హం. మొత్తంగా చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని, అలా సాదా సీదాగా వెనకేసుకుంటుంది ఈ సినిమా. మరి ఈ కలెక్షన్స్ కి శుభం కార్డు ఎక్కడ పడుతుందో చూద్దాం.