Vinaya-Vidheya-Rama-effect on Sye Raa Narasimha Reddy.మెగాస్టార్ అనే బ్రాండ్ ఉన్నంతవరకూ చెర్రీ పెట్టిన పెట్టుబడికి డోకా ఉండదు. అయితే అన్ని రోజులు మనవి కావు కదా, కాస్త జాగ్రత్త పడాలి. అందులోను సొంత సినిమా విషయంలో మరింత జాగ్రత్త పడాలి. ఎందుకంటే మహామహులు అయినటువంటి అమితాబ్ కుటుంబమే ప్రొడక్షన్ లో చాలా ఇబ్బందులు పడింది. ఇప్పుడున్న మార్కెట్ చూసి అయినా, చెర్రీ తాజా సినిమా వినయ విధేయ రామ రిజల్ట్ చూసి అయినా కాస్త ఆలోచించాలి చెర్రీ.

‘సైరా’ సినిమాను భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాడు చెర్రీ. అయితే వివిధ భాషలో రిలీజ్ అవుతున్న సినిమా కనుక ఇబ్బందిలేదు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే తాజాగా రిలీజ్ అయినా రోబో-2 .0 ది కూడా అదే పరిస్థితి. సినిమా భారీ ఖర్చుతో తెరకెక్కింది. కొన్న వాళ్ళు కూడా భారీగానే కొన్నారు. కట్ చేస్తే సినిమా మంచి టాక్ కూడా వచ్చింది. అయితే అన్నీ బాగానే ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు…సినిమా ఖర్చు ఎక్కువ కావడంతో భారీ రేట్లకు అమ్మడంతో బయ్యర్స్ కి బ్రేక్ ఈవెన్ అవడం కష్టం అయిపోయింది. చాలా చోట్ల సినిమా మంచి వసూళ్లే సాధించినప్పటికీ బ్రేక్ ఈవెన్ కాక నష్టాల్లో కూరుకుపోయారు బయ్యర్స్.

మరి చిరు సైరాకి కూడా భారీగానే ఖర్చు పెడుతున్నాడు చెర్రీ..సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి, మంచి వసూళ్లు సాధిస్తే పర్వాలేదు, లేదంటే అసలుకే మోసం వస్తుంది అని చెప్పక తప్పదు.