Vinaya Vidheya Rama compares with baahubali scenesతమ అభిమాన హీరోకి మద్దతుగా నిలబడటానికి పాపం అభిమానులు ఎన్ని వ్యయ ప్రయాసలు పడుతూ ఉన్నారో వినయ విధేయ రామ సినిమా తర్వాత మెగా ఫాన్స్ ను చూస్తే అర్ధం చేసుకోవచ్చు. వినయ విధేయ రామ సినిమాలో యాక్షన్ సీన్స్ మరీ ఇబ్బందికరంగా ఉండడంతో ఆ సీన్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ దారుణంగా జరుగుతుంది.

కట్ చేస్తే తమ అభిమాన హీరోకి మద్దతుగా నిలిచే క్రమంలో మెగా ఫాన్స్ కాస్త ఎమోషనల్ గా మారిపోయి, బాహుబలి సినిమా రెండో భాగం చివర్లో కోటలోకి వెళ్ళడానికి తాడి చెట్లను ఉపయోగించుకునే సీన్ తప్పుగా లేనప్పుడు, ట్రైన్ పై బీహార్ వెళితే తప్పు ఏంటి? పాము మనిషిని కరిస్తే చచ్చిపోవడంలో తప్పు ఏముంది. ఇక తలకాయలు గెద్దలు తీసుకెళ్తే తెప్ప ఏంటి? అయినా సినిమాను సినిమాగా చూడాలి అని లాజిక్స్ వెతక కూడదు అనేది మెగా ఫాన్స్ వాదన.

అయితే వారి వాదనలో తప్పు లేదు కానీ, సినిమా కథా పరంగా, అన్ని రకాలుగా బావుండి ఇలా ఆరా కొరా సీన్స్ పడితే పెద్దగా విమర్శలు రావు కానీ, అసలు సినిమా మొత్తం అలానే ఉన్న క్రమంలో ఇదిగో ఇలానే విమర్శల దాడి జరుగుతుంది. బాహుబలికి వినయ విధేయ రామకి మధ్య జరిగింది అదే.