Vinaro Bhagyamu Vishnu Kathaమాములుగా బిజినెస్ పెంచుకోవడానికి లేదా కొత్తగా పెట్టిన దుకాణానికో మాల్ కో జనాన్ని ఆకట్టుకోవడానికి రకరకాల ఆఫర్లు పెట్టడం ఎప్పటి నుంచో ఉన్నదే. డి మార్ట్ లాంటివి అంత పెద్ద సక్సెస్ కావడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఈ ఆకర్షణీయ పథకాలే. ఉచితం అనే మాట మన భారతీయులకు ఎంత వినసొంపుగా ఉంటుందో వేరే చెప్పాలా. వంద రూపాయలు పెట్టి కొన్ని వస్తువుకు ఓ రెండు రూపాయల ఐటెం ఫ్రీగా ఇస్తే గొప్పగా మురిసిపోయే సగటు మధ్యతరగతి మనస్తత్వాలే కార్పొరేట్ కంపెనీలకు కోట్ల కనకవర్షం కురిపిస్తాయి.

ఇప్పుడీ ట్రెండ్ సినిమాలకు పాకిపోయింది. కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథకి బుధ గురువారాలు రెండు రోజులు సింగల్ స్క్రీన్లలో ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ అని ప్రకటించారు. అంటే హాఫ్ రేట్ లో హ్యాపీగా కొత్త మూవీని థియేటర్ లో ఎంజాయ్ చేయొచ్చన్న మాట. టాక్ అటుఇటుగా రావడం వల్లే గీతా ఆర్ట్స్ 2 లాంటి పెద్ద బ్యానర్ సైతం ఈ బాట పట్టక తప్పలేదు. హిందీలో షెహజాదాకి ఇలాగే చేశారు కానీ ఫలితం దక్కలేదు. ఆ మధ్య రైటర్ పద్మభూషణ్ కోసం ఏకంగా మహిళలకు రోజంతా ఫ్రీ షోలు వేయడం మంచి ఫలితాన్ని ఇచ్చింది.

Also Read – వైనాట్ కుప్పం అన్నారుగా… రీపోలింగ్ ఎందుకు?

ఇలా ఎందుకు చేయాల్సి వస్తోందంటే సమాధానం చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. వినరో భాగ్యముకి డివైడ్ టాక్ వచ్చింది. సార్ పోటీని తట్టుకోలేకపోయింది. ఆదివారం దాకా బండి బాగానే లాగినా సోమవారం నుంచి డ్రాప్ చాలా ఆందోళనకరంగా ఉందని బయ్యర్లు రిపోర్ట్ చేయడంతో అప్పటికప్పుడు అలోచించి ఈ వన్ ప్లస్ వన్ స్కీంకి తెరతీశారు. టికెట్ ధరలతో మిడిల్ క్లాస్ ఆడియన్స్ ఎప్పుడో థియేటర్లకు రావడం తగ్గించేశారు. వాళ్ళను రప్పించడానికి ఇలాంటివి రెగ్యులర్ గా అమలు చేయాలి.

విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఓటిటిలు, ఆన్ లైన్ పైరసీ, మారుమూల ప్రాంతాలకు సైతం టెలిగ్రామ్ లాంటి యాప్స్ ద్వారా అనధికారికంగా కొత్త సినిమాలు చేరుతున్న ట్రెండ్ లో జనాన్ని రప్పించాలంటే ఇలాంటి మార్కెటింగ్ గిమ్మిక్కులు వాడాల్సిందే. ఇందులో ఇంకో కోణం లేకపోలేదు. మరీ ఫస్ట్ వీక్ కే ఇలాంటి ఆఫర్లు ఎందుకిచ్చారబ్బా అనే సందేహం వచ్చినా చిక్కే. ఏదైతేనేం వస్తువులకు మాత్రమే ఉండే స్పెషల్ డిస్కౌంట్లు, ఆఫర్లు క్రమంగా సినిమాలకూ పాకుతున్నాయి. రాబోయే రోజుల్లో ఫ్యామిలీ ప్యాక్ కింద కొత్త స్కీములు వచ్చినా ఎంతమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.

Also Read – జగన్ కళ్ళు తెరిపించిన బ్లూ మీడియా..!