Villagers- protest at LG polymers for complete shutdownవిశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ కి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత గ్రామం ఆర్ఆర్ వెంకటాపురంలో వాసులు ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. భారీగా నష్టపరిహారం ఇవ్వడంతో ఈ గొడవ ఇక్కడితో సర్దుమణిగిపోతుంది అనుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా కంగుతిన్నారు.

లీకేజీ జరిగి దాదాపు 60 గంటలు అవుతున్నా కంపెనీ యాజమాన్యం పై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో ఆగ్రహించిన బాధితులు… తమ కుటుంబ సభ్యుల మృతదేహాలతో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద ఆందోళనకు దిగారు. నష్టపరిహారం కాదు తమకు శాశ్వత పరిష్కారం కావాలని, వెంటనే కంపెనీని మూసెయ్యాలని వారు డిమాండ్ చేశారు.

ఈ తరుణంలో బాధితులకు కోటి రూపాయిల పరిహారం ఇవ్వడంతోనే తాము ఈ ప్రమాదాన్ని అద్భుతంగా హేండిల్ చేశాం అని జబ్బలు చర్చుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు ఒక బాధిత మహిళ సవాలు విసిరింది. “మాకు కోటి రూపాయిలు ఇవ్వడం కాదు… ముఖ్యమంత్రిని వచ్చి 15 నిముషాలు ఆ విషపు వాయువును పీల్చమనండి, మేమే కోటి రూపాయిలు ఇస్తాం,” అని చెప్పుకొచ్చింది.

అయితే ఇది టీడీపీ ప్రేరేపిత ఉద్యమం అంటూ సోషల్ మీడియాలో ప్రచారానికి తెరలేపింది వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్. ఈ ఘటనపై స్థానిక మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. “వారందరినీ కొంతమంది రెచ్చగొట్టారు… ఎవరూ రెచ్చిపోవద్దు…. ” అనడం గమనార్హం.