ThangalaanThangalaanవిలక్షణ నటుడు, ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనం చూపించాలని తపన పడే హీరో.. విక్రమ్. ఈమధ్య వరుస ప్లాపులతో వెనుకబడ్డాడు. పొన్నియిన్ సెల్వన్ విజయం విక్రమ్ కి కొంత ఊరటనిచ్చింది. ఇప్పుడు కొత్త ఉత్సాహంతో పాన్ ఇండియా సినిమా ‘తంగలాన్’ షూటింగ్ ని ప్రారంభించాడు. తంగలాన్ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్నారు. ఎక్కువగా వెనుకబడ్డ కులాల మీద సినిమాలు తీసే దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈరోజు తంగలాన్ సినిమా టైటిల్ ప్రోమో రిలీజ్ చేసారు. చుసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా ..ఈ సినిమాలో విక్రమ్ గాడిదలు కాసే కాపరి పాత్రలో కనిపించాడు. ఈ సినిమా కె.జి.ఎఫ్ గనుల నేపథ్యంలో తీస్తున్నారు అని ముందుగానే దర్శకుడు పా.రంజిత్ ప్రకటించాడు. ఈ టైటిల్ టీజర్ లో బంగారు గనుల కోసం బ్రిటిష్ వాళ్ళు ప్లాన్లు వేస్తున్నట్లు.. వాళ్ళ గనుల తవ్వకాల్ని ఆపడానికి గాడిదకాపరులు ఎలాంటి పోరాటం చేశారు అన్నది చూపించారు.

‘తంగలాన్’ అంటే హీరో పేరు. అందుకే అదే పేరుని అన్ని భాషల్లో టైటిల్ గా పెట్టారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువొతు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పశుపతి ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా లో విక్రమ్ గెటప్ చూస్తే కమల్ హాసన్ మరుదనాయగం గెటప్ గుర్తొస్తుంది. జి.వి.ప్రకాష్ సంగీతం టీజర్ లో చాలా బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వచ్చే సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఇప్పట్నుంచే ఎదురుచూస్తున్నారు.