Vijetha -Teaser Talk-Malavika Nair- Kalyan Devమెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతున్నట్లుంది. మెగా మూవీస్ అంటే హీరో సెంట్రిక్ గా రూపుదిద్దుకుంటుంటాయి. కానీ కళ్యాణ్ దేవ్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. దీనికి నిదర్శనమే తాజాగా విడుదల చేసిన ఫస్ట్ టీజర్.

ఈ టీజర్ లో హీరోగా కళ్యాణ్ దేవ్ ని ప్రమోట్ చేయడం కన్నా, సినిమాను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశమే కనిపించింది. బాధ్యతలు లేకుండా ఆవారా తిరిగే కొడుకు – ఏమోషనల్ గా ఫీలయ్యే తండ్రి… ఈ పాయింట్ కొత్తది కాదు… నాడు చిరంజీవి ‘విజేత’ నుండి కొన్ని వందల సినిమాలు ఇదే పాయింట్ తో ప్రేక్షకులను పలకరించాయి.

బహుశా చిరు ‘విజేత’ నుండి స్ఫూర్తి పొందారో ఏమో గానీ, ఈ ‘విజేత’ కూడా దాదాపుగా అలాగే కనపడుతోంది. చిరు స్థానంలో కళ్యాణ్ దేవ్, సోమయాజులు స్థానంలో మురళీశర్మను చూపించినట్లుగా టీజర్ ను కట్ చేసారు. టీజర్ ను చూసిన తర్వాత చిరు ‘విజేత’ సినిమాను రీమేక్ చేసి చెడగొట్టడం లేదు కదా అని ఫీలవ్వడం వీక్షకుల వంతు!