Vijetha-First-Look-Kalyaan-devచిరంజీవి చిన్నల్లుడు హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తోన్న “విజేత” సినిమాలో కళ్యాణ్ దేవ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. సాధారణంగా మెగా హీరోల సినిమాల ఫస్ట్ లుక్స్ గానీ, పోస్టర్స్ గానీ రిలీజ్ అయ్యాయంటే సోషల్ మీడియాలో ఒకటే హంగామా ఉంటుంది. అలా బజ్ ను క్రియేట్ చేయడంలో మెగా కాంపౌండ్ సక్సెస్ అవుతుంది. కానీ చిన్నల్లుడుకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ విషయంలో ఎలాంటి హంగామా లేకపోవడం విశేషం.

బహుశా లో ప్రొఫైల్ లో ‘విజేత’ను లాంచ్ చేయాలని భావిస్తున్నారో ఏమో గానీ, చాలా సింపుల్ గా కళ్యాణ్ దేవ్ లుక్ ను రిలీజ్ చేసారు. నవ్వుతూ ఉన్న ఓ ఫోటోను చిత్ర నిర్మాణ సంస్థ వారాహి ప్రొడక్షన్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసారు. మరి ఇలా లో ప్రొఫైల్ లో రిలీజ్ చేస్తే మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన కిక్ లభిస్తుందా? అంటే రిలీజ్ అయ్యే నాటికి మెగాస్టార్ ముందుకు రాకుండా ఉంటారా? ఖచ్చితంగా ఆ మెగా హంగామాకు ప్లాన్ ఉంటుందిలేండి అంటున్నారు సినీ జనాలు.