Vijethaమెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా ‘విజేత’ సినిమా రూపొందింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ ను కల్యాణ్ దేవ్ మొదలెట్టేశాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… తన మొదటి సినిమా రిలీజ్ అవుతున్న అనుభవాన్ని పంచుకున్నాడు.

“విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో టెన్షన్ పెరిగిపోతోందని, ఈ సినిమాను గురించి ఆలోచిస్తుంటే నిద్ర కూడా పట్టడం లేదని, నా కుటుంబ సభ్యులు .. స్నేహితులంతా కూడా ఈ సినిమా అవుట్ పుట్ పట్ల సంతృప్తికరంగా వున్నారని” సంతోషంగా తెలిపారు. ఇక ఈ సినిమా చూసిన తరువాత పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నానని, తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.