Vijayasai Reddy reacts on LG Chem Polymers controversyమీడియాలోని వార్తల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్ అని తేలింది. విజయసాయిరెడ్డి కరోనా పరీక్షలు నిర్వహించగా మంగళవారం సాయంత్రం పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన పీఏకి కూడా పాజిటివ్ అని తేలిందని సమాచారం.

వారిద్దరినీ హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారట. ఇది ఇలా ఉండగా.. ఈ పరిణామాన్ని విజయసాయిరెడ్డి కంఫర్మ్ చెయ్యకపోవడం గమనార్హం. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ట్విట్టర్లో ప్రకటించారు.

జాగ్రత్త వహించడంలో భాగంగా వారం నుంచి 10 రోజుల వరకు క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ వారం పది రోజుల పాటు టెలిఫోన్‌లో కూడా అందుబాటులో ఉండనని వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ తనకు ఫోన్ చేయొద్దని కోరారు.అయితే ఈ విషయాన్ని అంతగా దాయాల్సింది ఏమిటో అర్ధం కాదని పలువురు అంటున్నారు.

లాక్ డౌన్ విధించిన నాటి నుండీ విజయసాయి రెడ్డి నిబంధనలకు తుంగలో తొక్కుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు… అనేక సమావేశాలు నిర్వహించారు. ప్రతిపక్షాల విమర్శలు చేసినా పట్టించుకోలేదు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.