రాజ్యసభ ఎన్నికల పుణ్యామని అభ్యర్ధుల నేర చరిత్రల రికార్డులను సాధారణ పౌరులకు తిలకించే భాగ్యం దక్కింది. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ ఎనికైన విజయసాయి రెడ్డి తనపై ఉన్న క్రిమినల్ కేసుల జాబితాను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజ్యసభ అంటే పెద్దల సభ అంటారు. అందులో రాజకీయ పార్టీల నేతలతో పాటు మేధావులు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. అటువంటి పెద్దల సభకు తొమ్మిది క్రిమినల్ కేసులలో నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన స్వయంగా సమర్పించిన క్రిమినల్ రికార్డ్ జాబితా ఇదిగో…
2018, సెప్టెంబర్ 25వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలలో పాల్గొనే అభ్యర్ధుల క్రిమినల్ రికార్డ్ వివరాలు న్యూస్ పేపర్లు, టీవీలలో ప్రచురించేందుకు జారీ చేయబడినది.
అభ్యర్ధి పేరు, చిరునామా : వి. విజయసాయి రెడ్డి, బాలాజీ డాల్ఫిన్ హైట్స్, సీతమ్మధార, విశాఖపట్నం
నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్
డిక్లరేషన్: వి. విజయసాయి రెడ్డి అనే రాజ్యసభ అభ్యర్ధినైన నేను, నాపై నమోదైన క్రిమినల్ రికార్డ్ వివరాలను ఇందుమూలంగా ప్రజలకు తెలియజేస్తున్నాను.
I have published the number of cases registered against me and their details in public domain.
1/2 pic.twitter.com/SkoYQgZCgC
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 4, 2022