Vijayendra Prasad  script for BJPప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి అద్భుతం ‘బాహుబలి’ సినిమాకు కథను అందించిన విజయేంద్రప్రసాద్‌తో బీజేపీ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఆరెస్సెస్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల వరకు బీజేపీ పెట్టుబడిగా పెట్టనున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులు, సాధించిన విజయాలు, ఆరెస్సెస్ గొప్పతనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందుకు సంబంధించిన కథ కోసం విజయేంద్రప్రసాద్‌ను బీజేపీ ఇప్పటికే సంప్రదించినట్టు తెలుస్తోంది. అంగీకరించిన ఆయన కథా రచనను ఇప్పటికే మొదలుపెట్టినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర తారలు నటించనున్నట్టు తెలుస్తోంది. విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘మణికర్ణిక’ కోసం పనిచేస్తున్నారు. రాణి లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ ముఖ్య పాత్ర పోషిస్తోంది.