ఎన్నో ఏళ్లగా టీడీపీతో ఉన్న బంధాన్ని తెంచుకుని వస్తే జగన్ మోసం చేసారు

Vijayawada Lok Sabha ticket to PVP jagan betrayal to jai rameshఎన్నో ఏళ్లగా టీడీపీతో సన్నిహితంగా మెలిగిన దాసరి కుటుంబం ఇటీవలే వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరింది. దాసరి జై రమేష్ కు విజయవాడ పార్లమెంట్ సీటు ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో ఆయన,, ఆయన సోదరుడు దాసరి బలవర్ధన్ రావు వైకాపా కండువా కప్పుకున్నారు. ఐతే ఇప్పుడు వారికి ఆ పార్టీలో మొండి చెయ్యి చూపిస్తున్నట్టు సమాచారం. దీంతో ఆయన భవిష్యత్‌ డోలాయమానంలో పడింది. జైరమేశ్‌ను పక్కనబెట్టడంపై ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) రేపు వైకాపా అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 23న ఆయన నామినేషన్‌ వేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే వైకాపా తరఫున పీవీపీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. ఆ తరువాత ఆయన పవన్ కళ్యాణ్ కు దగ్గరగా చేరి టీడీపీలో టిక్కెట్ కోసం ప్రయత్నం చేశారు.

అయితే అది కూడా కుదరలేదు. దీనితో 2014లో ఆయన పోటీ చెయ్యలేదు. జగన్ కేసులలో ఒకటి రెండు కేసులలో పీవీపీ కూడా నిందితుడు కావడం విశేషం. విజయవాడ సిట్టింగు ఎంపీ కేశినేని నానికి ప్రజలలో మంచి పేరు ఉంది. ఆర్ధికంగా కూడా గట్టి అభ్యర్థి. ఆయనను ఢీకొట్టడానికి అదే సామజిక వర్గానికి చెందిన పీవీపీని తెర మీదకు తెచ్చారు జగన్. నానిని పీవీపీ అడ్డుకోగలరేమో చూడాలి. నాని ఇప్పటికే విజయవాడలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం కూడా మొదలు పెట్టేశారు.

Follow @mirchi9 for more User Comments
Will-Saaho-Provide-Another-Shock-For--BollywoodDon't MissWhat Would Be Shocking Performance For Saaho In Bollywood?The Bollywood industry is currently going through a transformation phase with old guard Khans struggling...Don't MissImpressive: Naidu Calm in The Storm of ControversyFormer Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu was subjected to frisking in Gannavaram Airport...Does-TDP-Really-Need--A-Political-StrategistDon't MissDoes TDP Really Need A Political Strategist?The news about TDP approaching Political Strategist Prashant Kishor's I-PAC went viral in the social...Game Over Telugu Movie Review, Taapsee's Game Over Review RatingsDon't MissGame Over Review - Out Of The Box GameBOTTOM LINE Out Of The Box Game OUR RATING 2.5/5 CENSOR 'U/A' Certified, 1 hrs...Governor's Speech Has No Mention About AmaravatiDon't MissGovernor's Speech Has No Mention About AmaravatiGovernor ESL Narasimhan had addressed a joint session of the Andhra Pradesh Assembly a little...
Mirchi9