Vijayasaireddy comments on chandrababu naiduఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి గురించి మీడియాలో చాలా రాస్తున్నారు. కొందరు ఏకంగా రాష్ట్రం దివాళాకు దగ్గరగా ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఎవరు అప్పులు చెయ్యడం లేదు అంటూ వాదిస్తుంది.

అయితే గతంలో ఎన్నడు లేనట్టుగా ఫస్ట్ తారీఖుకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి చూస్తుంటే ప్రజల్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు పై ఎదురుదాడి చెయ్యడానికే ప్రాధాన్యత ఇస్తుంది అధికార పార్టీ.

ప్రభుత్వానికి రుణాలు ఇవ్వొద్దని ఆర్థిక సంస్థలను బెదిరిస్తూ కోవర్టుల ద్వారా పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగిస్తున్నాడు చంద్రబాబు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి స్త్రీలకు పింఛన్లు అందొద్దని నీచమైన ఎత్తులు వేస్తున్నాడు. రేపు ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తావు బాబూ? అంటూ మొన్న విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఆయన ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు మరింత భయాందోళనలకు దారి తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ కూడా పెన్షన్లకు అప్పులు తెచ్చే పరిస్థితి లేదు. జీతాలకు, పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం సరిపోతుంది. ఏవైనాపెద్ద పథకాలకు ఇతర ఖర్చులకు మాత్రం అప్పులు చేస్తారు.

ఇప్పుడు ఎంపీ గారే అప్పులు రాకపోతే పెన్షన్లు ఇవ్వలేం అని చెబుతుంటే ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి కొత్తగా ఇంకొకరు చెప్పడానికి ఏముంది?