Vijayasai Reddy complaints to police on janasena tdp social media accountsప్రపంచం మొత్తం కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం వేచి చూస్తుంది. కొన్ని దేశాలు ఇప్పటికే వాక్సిన్ అత్యవసర ఉపయోగం కోసం పర్మిషన్ ఇచ్చాయి. హై రిస్క్ గ్రూప్ లోని వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే భారత దేశం మాత్రం ఇప్పటివరకు ఏ వ్యాక్సిన్ ను అనుమతించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని అధికార పక్షం మాత్రం దానిని అప్పుడే రాజకీయంగా వాడేస్కుంటుంది.

ట్విట్టర్ లో రోజంతా ఆత్మస్తుతి పరనింద తో బిజీగా ఉండే విజయసాయి రెడ్డి .. ఈరోజు ఏకంగా వ్యాక్సిన్ ని కూడా వాడేశారు. “డిసెంబరు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది,” అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మీరు ఎలా పంపిణీ మొదలుపెడతారు? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. నెటిజన్లు ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరైన విజయసాయి రెడ్డి ఆ తరువాత ఆ ట్వీట్ డిలీట్ చెయ్యాల్సి వచ్చింది.

మరోవైపు…. ఇప్పటికే రాష్ట్రాలు వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు మొదలుపెట్టాయి. తొలుత కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటు 50 ఏళ్లు పైబడిన వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. తొలి దశలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.