Vijayasai Reddy reacts on LG Chem Polymers controversyవిశాఖపట్నంలో విషవాయువుల లీకేజీ కి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెతకవైఖరి అవలంభిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. తేలికైన సెక్షన్ల కింద కేసులు నమోదు చెయ్యడం…. ఇప్పటివరకూ ఒక్క అరెస్టు కూడా చెయ్యకపోవడంతో ప్రభుత్వం విమర్శలకు తావిచ్చింది.

దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ…. కమిటి నివేదిక వచ్చాకే కంపెనీపై చర్యలు, పరిహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. అలాగే కంపెనీలో ఎవరో రవీంద్ర రెడ్డి అని ఉంటే తనకు బంధువని ప్రచారం చేస్తున్నారని… ప్రపంచంలో ఎక్కడ రెడ్డి అని ఉంటే అక్కడ నాకు బంధుత్వం అంటగడితే ఎట్లా అని ఆయన ప్రశ్నించారు.

విజయసాయి రెడ్డి బాధలో అర్ధం ఉంది అయితే ప్రపంచంలో ఎక్కడ కమ్మ వారు ఉంటే వారు చంద్రబాబు తొత్తు అని, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో కుట్రపన్నుతున్నారని అనుకోవడం, ఆరోపించడం, ఒక కులం వారి మీద కత్తి కట్టి వారిని సాగనంపడం కూడా అంతే తప్పు కదా? రెడ్డికి ఒక న్యాయం చౌదరికి ఇంకో న్యాయం ఉండకూడదు కదా?

ఇక కమిటి లో ఒక్క కెమికల్ రంగానికి చెందిన నిపుణుడు కూడా లేకుండా వచ్చే నివేదికతో దోషులను ఎలా పట్టుకుంటున్నారు? బాధితులకు ఎలా న్యాయం చేస్తారు? ఈ ఉదంతంలో ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కోటి రూపాయిలు ఇచ్చాం కాదా ఇక ప్రజలు అంతా మర్చిపోతారు అనుకుంటే పొరపాటే.