Pawan Kalyan - Vijayasai Reddyనిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వేసిన నీతిబాహ్యమైన ట్వీట్ల కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల పాలయ్యారు. ఐనా ఆయన తన పద్దతి మార్చుకోలేదు. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభ్యంతరకరంగా సంబోధించారు.

“చంద్రబాబు కరోనా వ్యాక్సినేషన్ ఎప్పుడు తీసుకున్నాడు? పావలాకు అసలు కరోనా పాజిటివ్ వచ్చిందా, వస్తే మూడ్రోజుల్లోనే నెగెటివ్ ఎలా అయింది? వైద్య శాస్త్రం పరిధిని దాటిన ఈ రెండు అంశాలు అందరిలో ఆసక్తిని రేపుతున్నాయి. WHO సైంటిస్టులెవరైనా పరిశోధన చేస్తే బాగుండు,” అంటూ ట్వీట్ వేశారు ఆయన.

చంద్రబాబు కరోనా వాక్సిన్ తీసుకుంటే విజయసాయి రెడ్డికు ఎందుకు తీసుకోకపోతే ఎందుకు? తీసుకుంటే మీడియా ముందు తీసుకోవాలని రూల్ ఉందా? లేక తీసుకుంటే గానీ కుదరదని రాజ్యాంగంలో ఏమన్నా రాసి ఉందా? అని టీడీపీ సమర్ధకులు విరుచుకుపడుతున్నారు. ఇక ఒక రాజకీయ నేతను పావలా అంటూ సంబోధించే కుసంస్కారం ఏమిటి అంటూ జనసైనికులు విమర్శిస్తున్నారు.

“పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు పాజిటివ్ వచ్చిందో సాయి రెడ్డి పవన్ కళ్యాణ్ ఇంటిలోకి దూరి చూశారా? కనీస సంస్కారం లేకుండా సాటి నేతలకు మనుషులకు మర్యాద ఇవ్వని విజయసాయి రెడ్డి బుర్ర మీద WHO సైంటిస్టులెవరైనా పరిశోధన చేస్తే బాగుండు,” అంటూ వారు గట్టిగానే సమాధానం చెబుతున్నారు.