Vijaya Sai Reddy  Twitterవైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ట్వీట్లు వెయ్యడం మొదలు పెడితే అడ్డు ఆపు లేకుండా చెలరేగిపోతాడు. అడిగేవారు లేకపోవడంతో ఆత్మస్తుతి, పరనిందలో అడ్డు లేకుండా ముందుకు సాగిపోతారు. కాకపోతే అందులో మనం తర్కం వెతకడం మొదలుపెడితే మాత్రం దొరికిపోతారు.

తాజాగా ఈరోజు “అర్హతలుండీ సంక్షేమ పథకాలు అందని లబ్దిదారుల కోసం ప్రభుత్వం గాలిస్తుంటే, బాబేమో ఏ గుడిని కూల్చాలా అని రాత్రిళ్లు టార్చిలైటు వేసి వెతుకుతున్నాడు. ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడల్లా ఇలా నీచ స్థాయికి దిగజారతాడు. ఎల్లో మీడియా దాస్తూ వచ్చిన క్రూరత్వ కోణం ఇప్పుడు నగ్నంగా బయట పడింది,” అని ట్వీట్ చేశారు ఆయన.

బాబు ఏ దేవాలయాలు కూల్చాలా అని రాత్రిళ్లు టార్చిలైటు వేసి వెతుకుతుంటే ప్రభుత్వం… దాని వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? అర్హతలుండీ సంక్షేమ పథకాలు అందని లబ్దిదారుల కోసం ప్రభుత్వం గాలించడం తప్ప ఇంకో పని ప్రభుత్వానికి లేదనుకుంటున్నారా? లేదా లా అండ్ ఆర్డర్ అనేది మా వల్ల కాదు అని చేతులెత్తేశారా?

ఎల్లో మీడియా దాస్తూ వచ్చిన క్రూరత్వ కోణం ఇప్పుడు నగ్నంగా బయట పడింది అని అంత కచ్చితంగా చెబుతున్నప్పుడు ఎందుకు 100కు పైగా ఆలయాలలో జరిగిన దాడుల విషయంలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా శిక్షించలేకపోయింది ప్రభుత్వం. ఒక ఆధారం కూడా లేకుండా రాజకీయ విమర్శలు చేస్తే ట్విట్టర్ లో చెల్లుతుందేమో గానీ కోర్టుల లో చెల్లదు కదా?