Vijaya Sai Reddy tweets narendra modi govt  appreciates jagan on coronavirus crisis managementవైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, విజయసాయి రెడ్డి ట్విట్టర్ అకౌంట్ ను ఆయనే మెయింటైన్ చేస్తారో లేక ఎవరితోనైనా మెయింటైన్ చేయిస్తారో తెలీదుగానీ… ఆయన ట్వీట్లు చాలా చిత్రంగా ఉంటాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా కంట్రోల్ చర్యల మీద వేసిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది.

“రాష్ట్రానిధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కోవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపి దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. WHO కూడా ఆరా తీస్తోంది,” అని ఆయన ట్వీట్ చేశారు.

గత 24 గంటల్లో రాష్ట్రంలో 62 కరోనా వైరస్ కేసులు, మరో రెండు మరణాలు నమోదయ్యాయి. ఈ 62 కేసుల్లో కర్నూలు అత్యధికంగా 27 కేసులను నమోదు చేసింది. ఈ కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసులు 955 వరకు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకూ 29 మంది మరణించారు మరియు 145 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లోని కరోనా కేసులు తెలంగాణతో సమానంగా ఉన్నాయి. టెస్టులు ఎక్కువగా చేస్తున్న కారణంగా కేసులు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా తెలంగాణతో పోల్చితే రికవరీ కేసులు తక్కువగా ఉండటం, మరణాలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. నిన్న రాత్రి లెక్కల ప్రకారమే… తెలంగాణాలో 252 రికవరీలు, 25 మరణాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా తెలంగాణ ఏపీ కంటే బెటర్ పొజిషన్ లో ఉంది మరో WHO ఆంధ్రప్రదేశ్ ని సంప్రదించడం ఏంటో. ఇదెక్కడి డప్పు… విజయసాయి రెడ్డి గారూ? అంటూ ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు.