Vijaya- Sai -Reddy - tweet response on ration rice bagsఆంధ్రప్రదేశ్‌లో తెల్లరేషన్ కార్డులపై పంపిణీ చేస్తున్న మంచి బియ్యంలో నాణ్యత లోపించిందని ఆరోపణలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ‘నాణ్యమైన బియ్యం’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. అయితే, నాణ్యమైన బియ్యం అందుకొన్నవారిలో 20మందిదాకా, ఆ బియ్యం బాగాలేవని ఫిర్యాదు చేశారని జిల్లా కలెక్టరే స్వయంగా పరకటించారు. ఈ బియ్యానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి.

మొదట్లో దీనిని తమ సోషల్ మీడియా వింగ్ తో కలిసి తిప్పికొట్టాలని ప్రయత్నించినా సాధ్యపడక ఆ తరువాత వర్షాల కారణంగా 25 బియ్యం సంచులు తడిసిపోయాయని వాటి స్థానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామని మంత్రి కొడాలి నాని వివరించారు. అయితే ఈ విషయానికి కొత్త ట్విస్టు ఇచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని, కేవలం ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపించారు ఆయన.

“మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు @AndhraPradeshCM గారు. ఆ బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంట లోపలే క్షుద్ర దాడి మొదలు పెట్టారు పచ్చ దొంగలు,” అని ఆయన ట్విట్టర్ లో పోస్టు చేసారు. బియ్యం సేకరించింది పౌరసరఫరాల శాఖ, అది ప్యాక్ చేసింది ప్రభుత్వం వారే, అవి చేరింది ప్రభుత్వ కనుసన్నలలో పని చేసే రేషన్ డీలర్ల వద్దకు, పంపిణీ చేసింది ప్రభుత్వం నియమించిన గ్రామా వాలంటీర్లు… అయినా ప్రతిపక్షాన్నే నిందిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ వారు.