Vijaya- Sai -Reddyవైఎస్సార్ కాంగ్రెస్ ఒక విచిత్రమైన జబ్బుతో బాధపడుతుంది. ఆ జబ్బు ఏంటంటే చంద్రబాబు దేనినైనా కావాలి అనుకుంటే తాము దానిని వద్దు అనాలి, చంద్రబాబుకు ఏదైనా కావాలంటే దానిని వెంటనే చంకనెక్కించుకోవాలి. దీనికి ప్రత్యేక నిదర్శనం ఈరోజు ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు. వీవిప్యాట్ల పై సుప్రీం తీర్పు నేపథ్యంలో విజయసాయిరెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

“చంద్రబాబు మెంటల్ బ్యాలన్స్ కోల్పోయాడు. అన్ని వివిప్యాట్లను లెక్కించడం సాధ్యం కాదని కిందటి సారే సుప్రీం తేల్చి చెప్పింది. కోర్టు తీర్పును తప్పు పట్టేలా మాట్లాడాడు. మళ్లీ సుప్రీంలో రివ్యూకు వెళ్తే కర్రు కాల్చి వాత పెట్టింది. 40 ఏళ్లలో స్వార్థం తప్ప హుందాతనాన్ని అలవర్చుకోలేదు’ అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. వివిప్యాట్లను 50% లెక్కిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ కు వచ్చిన నష్టం ఏంటి? ఆ మేరకు లెక్కిస్తే ప్రజలలో ఉన్న అనుమానాలు కూడా తొలగిపోతాయి.

ఆ చర్య వల్ల భారతదేశంలోని ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల నిర్వహణ తీరు మీద నమ్మకం పెరుగుతుందే గానీ తగ్గదు. ఒకవేళ నిజంగా టాంపరింగ్ లాంటిది జరిగితే దీనిద్వారా అరికట్టవచ్చు. ఏ రకంగా చూసినా ఇది వైఎస్సార్ కాంగ్రెస్ కు కూడా మంచిదే. నిజంగా మోడీ వైకాపాకు అనుకూలంగా టాంపరింగ్ చేయిస్తే తప్ప. అటువంటిది దీనిని విమర్శించడంలో లాజిక్ ఏంటో? ఏదో చంద్రబాబు సమర్థిస్తున్నారు కాబట్టి మేము విమర్శిస్తాం అని చెప్పడం తప్ప? చంద్రబాబును విభేదించే క్రమంలో విచక్షణ కోల్పోతున్నారేమో చూసుకుంటే మంచిది.