Vijaya Sai Reddy targets chandrababu naidu with caste politicsరాజకీయాలలో ఏ కులం కూడా అంటరానిది కాదు. అన్ని రాజకీయ పార్టీలకు, అందరు రాజకీయ నాయకులకు అన్ని కులాల వారు కావాలి, కలుపుకుని వెళ్ళాలి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ కు కమ్మ కులం అంటే ద్వేషం. నిత్యం ఆ కులాన్ని దూషిస్తూ ఉంటారు. చంద్రబాబుకు సంబంధించింది ఏదైనా వ్యతిరేకించడం ఆ పార్టీకి మక్కువ. కాకపోతే చంద్రబాబు కోసం ఆ కులాన్ని మొత్తం ద్వేషించడం ఏంటో అర్ధం కానీ విషయం. దీనికి ఉదాహరణ ఈరోజు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు.

“మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి రవిప్రకాష్‌ బండారం ఎట్టకేలకు బయట పడింది. ఈయన బాధితులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకొస్తున్నారు. ‘కమ్మ’ని నీతులకు కాలం చెల్లింది. చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్లలో రవిప్రకాష్‌ ఒకడు,” అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబుని విమర్శించారు సరే… రవిప్రకాశ్ ను తప్పు పట్టారు అది కూడా ఓకే. అసలు ఈ విషయంలో కమ్మ కులంపై ఏడుపేంటి? ఇలా అసందర్భంగా ఒక కులంపై వక్రభాష్యాలు చెప్పడమేంటి?

కమ్మ కులం అంటే చంద్రబాబు నాయుడు లాంటి పలువురు తెలుగుదేశం నాయకులు వారిని సమర్ధించే వారు మాత్రమే అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయమా? మళ్ళీ ఇదే నాయకులకు వేరే వారికి కులగజ్జి అదీ ఇదీ అంటూ ఆరోపణలు చేస్తారు. వీరికి ఉన్న కులదురహంకారమే అన్నిటికంటే పెద్ద జబ్బు అంటే కాదని అనగలరా? అసలు వీటిని ఆ పార్టీలోని కమ్మ నేతలు ఎలా భరిస్తున్నారు? వైఎస్సార్ కాంగ్రెస్ లోని కమ్మ నేతలకు పౌరుషం లేదా?