Vijaya -sai Reddy  satire on nara lokesh and chandrababu naiduపార్లమెంట్ లో సభ్యుడైయ్యుండి ఓ ఫేక్ నెటిజన్ లా వ్యవహరించడం ఎవరికీ సాధ్యం? అంటే దానికి నేనున్నాను అంటూ చేయి ఎత్తడం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వంతవుతోంది. అందుకు నిదర్శనమే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ పోస్టింగ్ నిలుస్తోంది. నారా లోకేష్ కు సంబంధించిన ఓ ఫేక్ ఫోటోను పోస్ట్ చేస్తూ తెలుగులోని అన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ కు ట్యాగ్ చేసారు విజయసాయిరెడ్డి.

బహుశా తన చిల్లర పనులు మీడియా వర్గాలన్నీ ప్రసారం చేసి తద్వారా పబ్లిసిటీ పొందాలనుకున్నారో ఏమో గానీ, ఈ సందర్భంగా సదరు ఎంపీ గారి ఏహ్య బుద్ధి బయటపడింది. రాజకీయంగా టిడిపిని ఎదుర్కోలేక, వ్యక్తిగతంగా లోకేష్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ పోస్టింగ్ వలన లోకేష్ కు జరిగే నష్టం ఎంతుంటుందో గానీ, రిప్లైల రూపంలో తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే వేసుకుంటున్నారు.

అయితే ఇలా ఫేక్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్విట్టర్ లలో హల్చల్ చేస్తున్న వారి ఖాతాలను క్రమపద్ధతిలో ట్విట్టర్ వర్గాలు తొలగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే, ‘ట్విట్టర్ చేత విజయసాయిరెడ్డి బ్లాక్ చేయబడ్డారు’ అన్న వార్తతో మరింతగా పాపులర్ అవ్వడం ఖాయంగా పేర్కొనవచ్చు. రాష్ట్ర సంక్షేమం వదిలేసి, ఇలా ఫేక్ ఫోటోలతో కాలక్షేపం చేయడం వలనే వైసీపీ పరిస్థితి ఈనాడు ఇంత దారుణంగా ఉంది.