Vijayasai-Reddy-Meeting-with Amit Shahఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… “ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ” అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత, ‘వైసీపీ అందుకే కో’ అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే.

జగన్ బెయిల్ రద్దయ్యే సూచనలు ఉన్నాయంటూ అప్పుడు మీడియాలలో కధనాలు కూడా పెద్ద ఎత్తున ప్రసారం అయ్యాయి. అయితే అంతిమంగా రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్ట్ కొట్టివేయడంతో, ‘జగన్ అండ్ కో’ ఊపిరి పీల్చుకుంది.

ఇక వర్తమానంలోకి వస్తే… ‘ముఖ్యమంత్రిగా ప్రతి వారం గానీ, వారానికి అయిదు రోజులు గానీ కోర్టుకు హాజరు కావడం సాధ్యపడదు’ అనే అంశం మీద తుది తీర్పును తెలంగాణ హైకోర్టు వెలువరించాల్సి ఉంది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్ట్, రాబోయే ఒకటి, రెండు రోజుల్లో తీర్పును వెలువరిస్తుందని మీడియాలో వార్తలు వచ్చాయి.

నేడు అమిత్ షాతో మళ్ళీ విజయసాయిరెడ్డి మరియు మిథున్ రెడ్డిలు భేటీ అయ్యారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల మరియు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన వ్యయానికి ఆమోదం తెలపాలని కోరినట్లుగా, అలాగే వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్ధిక సాయాన్ని అందించాలని కోరినట్లుగా తెలిపారు.

కాకతాళీయమో ఏమో గానీ, జగన్ కు సంబంధించి కోర్టుల్లో తీర్పులు వెలువరించే కొద్దీ రోజులు ముందు ‘వైసీపీ అండ్ కో’ అమిత్ షాతో భేటీ అవడం వరుసగా ఇది రెండోసారి. అప్పటివరకు ఏపీకి సంబంధించిన అంశాలు అమిత్ షాను అడగాలనిపించదో లేక అప్పుడే అప్పాయింట్మెంట్ లభిస్తుందో గానీ, వైసీపీ – బీజేపీల భేటీ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతలను దక్కించుకుంటోంది.