Vijaya- Sai -Reddy - grama  secretariate exam papers leak గ్రామా సచివాలయ ఎక్సమ్ పేపర్ లీక్ అయ్యిందంటూ కొన్ని మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే దీని మీద ప్రభుత్వాన్ని విమర్శించి, విచారణకు డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం అటువంటిది ఏమీ జరగలేదని, ప్రతిపక్షాలు కావాలని ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని చెప్పుకొచ్చింది.

ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కొత్త తలపోటు తెచ్చిపెట్టారు విజయసాయిరెడ్డి. విశాఖపట్నంలో జరిగిన ఒక పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… “ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేసిన వైఎస్ అభిమానుల కొరకు ఏం చేసిందంటే… ఇప్పటివరకు నియమించిన మూడు లక్షల గ్రామా వాలంటీర్లలో 90% మన పార్టీ వారే అని ఖచ్చితంగా చెప్పగలను,” అని ఆయన చెప్పుకొచ్చారు.

పైగా 90% మన వారికే వచ్చాయి అనే దాని మీద నా దగ్గర ఖచ్చితమైన లెక్కలు కూడా ఉన్నాయి అని ఆయన చెప్పడం కొసమెరుపు. విజయసాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు రాజకీయవర్గాలలో కలకలం రేపుతోంది. ప్రతిపక్షాలు ఇప్పటివరకు చేసిన విమర్శలకు ఈ వ్యాఖ్యలు బలం చేకూరుస్తుంది. ప్రభుత్వాన్ని ఆయన ఇరుకునపెట్టినట్టే.

మరోవైపు ప్రభుత్వం మాత్రం పేపర్ లీక్ గురించి ఒప్పుకునే సమస్యే లేదని వార్తలు వస్తున్నాయి. అంతర్గతంగా దీని మీద మొక్కుబడిగా విచారణ చేసి సరిపెట్టాలని, విపక్షాలు చేస్తున్న డిమాండ్లకు తలొగ్గకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయంగా పడుతుంది. అయితే లీక్ అనేది నిజం అయితే అది ప్రభుత్వం ఇమేజ్ ప్రజలలో పల్చన చెయ్యడం ఖాయం.