vijaya sai reddy confidential GOవైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత యాక్టీవ్ గా ఉండే నేత. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రత్యర్థుల పై మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు.

ఆ క్రమంలో ఒక్కోసారి ఆయన వాడే మాటలు రాయడానికి ఇబ్బందికరంగా మారుతుంటాయి కూడా. అయితే ఆయన చేసిన ఒక విమర్శకు తెలుగుదేశం పార్టీ కూడా అదే భాషలో సమాధానం చెప్పడం శోచనీయం.

“చంద్రబాబు మొదటి 6 నెలల్లోనే 800 జీఓలను ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టకుండా గోప్యత పాటించాడు. ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. జీఓలు శాఖాధిపతులకు ఇచ్చే అధికారిక ఆదేశాలు. అవసరముంటే వాటిని పబ్లిక్ డొమైన్ లో పెడతారు. దివాలాకోరు పచ్చ పార్టీ వీటినీ వివాదం చేయాలనుకుంటోంది,” అంటూ ఒక ట్వీట్ వేశారు విజయసాయి రెడ్డి.

అందుకు ప్రతిగా తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా… “దొంగ లెక్కలు రాసి, 16 నెలలు చిప్ప కూడు తిన్నా, ఈ దొంగ లెక్కలు మాత్రం మానవే. అక్కడ ఉన్నది 144 కాన్ఫిడెన్షియల్ జీవోలు. దాన్ని 800 చేసి, ఫేక్ చేసి పడేసావ్. అయినా, అసలు పూర్తిగా ప్రజలకు అందుబాటులో జీవోలు లేకుండా చేసి కూడా, ఇలా ఎదురు దాడి చేస్తున్నావ్ చూడు, నెక్స్ట్ జనరేషన్ బులుగు ఫేక్ బ్యాచ్ కు నువ్వో ఇన్స్పిరేషన్ ఏ2,” అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.

విజయసాయి రెడ్డి ఆరోపించిన కాలంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ జీవోలు కేవలం 144 అంటూ రుజువులు కూడా పెట్టింది టీడీపీ. ఇక ఈ ఆరోపణల సంగతి పక్కన పెడితే… అసలు ప్రభుత్వానికి సంబంధించిన జీవోలను పూర్తిగా ఇంటర్నెట్ నుండి తొలగించాలని నిర్ణయించాకా చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని రహస్య జీవోలు ఇచ్చినా ఇప్పటి జగన్ ప్రభుత్వం కంటే బెటర్ అనే కదా!

Confidential GO