Vijaya Sai Reddy Comments on Nara Chandrababu Naiduశ్రీశైలం ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన మరో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కృష్ణా బోర్డుకు కూడా కంప్లయింట్ చేసింది. ఈ విషయంలో కూడా చంద్రబాబుని టార్గెట్ చెయ్యాలని చూస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. ఈ విషయంలో తాము పెద్దగా మాట్లాడింది ఏమీ లేదు గానీ…. చంద్రబాబు మాట్లాడటం లేదని ఫీల్ ఐపోతున్నారు.

“చంద్రబాబు గారూ.. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి..? అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు.. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా? మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..?,” అంటూ ఆ పార్టీ నెంబర్ టూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఇప్పుడు సీమ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు అధికార పార్టీ నేతలు మంచిదే. ప్రతిపక్షంలో ఉండగా… కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని పొలాలు ఎడారిగా మారిపోతుందని జగన్ జలదీక్ష చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చాకా అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కు ముఖ్య అతిధిగా వెళ్లొచ్చారు.

అప్పుడు జగన్ సీమ బిడ్డా కాదా? ఆ విషయం పక్కన పెడితే కేసీఆర్ పై అధికార పార్టీ నేతలు కూడా పెద్దగా మాట్లాడింది ఏముంది? పైగా మనం మనం ఒకటి అంటూ అనేక సార్లు మీటింగ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు కనీసం ఒక ఫోన్ కాల్ చేసైనా సమస్య ను ఎందుకు పరిష్కరించుకోవడం లేదు.