Vijaya- Sai- Reddy nameఆంధ్రప్రదేశ్ – తెలంగాణల మధ్య నీటి యుద్ధం సుప్రీం కోర్టుకు చేరింది. తెలంగాణ వైఖరి కారణంగా తమ వాటా నీరు తమకు దక్కడం లేదని ఆంధ్రప్రదేశ్ సుప్రీం ని ఆశ్రయించింది. ఈ కేసు ఎప్పటికి తేలుతుందో చూడాలి. ఈ లోగా ఈ విషయాన్ని చంద్రబాబు పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ వారు.

“తెలంగాణా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు నాడు బాబు పన్నిన ‘ఓటుకు నోటు కుట్ర’ రాష్ట్రాన్ని ఇప్పటికీ పీడిస్తోంది. తట్టాబుట్టా సర్దుకుని పారిపోయి రావడమేకాక, అక్రమ సాగునీటి ప్రాజెక్టులను ప్రశ్నించలేకపోయాడు. అరెస్టు తప్పించుకునేందుకు ఐదు కోట్ల మంది జీవితాలను తాకట్టు పెట్టాడు,” అంటూ ఆరోపించారు విజయసాయి రెడ్డి.

ఒకప్పుడు హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చారు అని ఆరోపించేవారు వైఎస్సార్ కాంగ్రెస్ వారు. ఈ మధ్య హైదరాబాద్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ కు రావట్లేదు అని విమర్శిస్తున్నారు. రెండేళ్ల నుండి చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నా ఇంకా తట్టాబుట్టా సర్దుకుని పారిపోయి వచ్చాడు అని విమర్శించడం గమనార్హం.

హైదరాబాద్ లో ఉన్నా ఏపీలో ఉన్నా చంద్రబాబు, కేసీఆర్లు విరోధులను తెలియంది ఎవరికీ? ఒకప్పుడు మేము మిత్రులం అని చెప్పిన వారే ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి మరి. చంద్రబాబు హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చినా, హైదరాబాద్ లోనే ఉండిపోయినా ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఆయన చెయ్యగలిగింది ఏమీ లేదు.

ఇంకా చంద్రబాబే కారణం… చంద్రబాబు చెయ్యాల్సింది ఏదో చెయ్యలేదు అంటూ విమర్శలు చేస్తే ప్రజలు ఈ మాత్రం దానికి చంద్రబాబుకే అధికారం ఇస్తే పోలా అని ఆలోచించే ప్రమాదం ఉంది.