vijaya Sai Reddy comments on Chandrababu Naiduఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి బదులుగా ఏటా రూ.15,000 ఇస్తామంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దానిని దారుణమనడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘రూ.2,000 కంటే రూ.15,000 తక్కువని చంద్రబాబు చెబితే నమ్మాలి. లేదంటే ధర్నాలు చేయిస్తారట. ఒక్కో విద్యార్థిపై మధ్యాహ్న భోజనం ఖర్చు ఏడాదికి రూ.2 వేలు. దాని స్థానంలో రూ.15 వేలు ఇస్తామని సీఎం జగన్‌ చెబితే దారుణమంటున్నారు’ అని ఆయన ట్విటర్‌లో విమర్శించారు.

పదవ తరగతి పిల్లలకు 15,000 రూపాయిలు అమ్మ ఒడితో పాటు మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇంటర్ విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం తీసేసి 15,000 రూపాయిలు ఇవ్వడం ఏంటి? అంటే ఇంటర్ విద్యార్థులకు ఇచ్చే అమ్మ ఒడి పథకం సొమ్ములలో 2000 రూపాయిల మేర తగ్గించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని విజయసాయి రెడ్డి చెబుతున్నారా? పైగా అదే విషయంలో ప్రతిపకక్షంపై ఎదురుదాడి చెయ్యడం మరింత విడ్డూరం.

ప్రతిపక్షం మధ్యాహ్న భోజన పథకం, అమ్మ ఒడి రెండు వర్తింపచెయ్యాలనే కదా అడిగేది? అసలు ఆ రెండు పథకాలకు లింకు ఏంటి? విజయసాయి రెడ్డి తెలివితేటలు చూపిస్తున్నారా? ఇది ఇలా ఉండగా జనవరి 26 నుండి అమలు అయ్యే ఈ పథకానికి సరిపోను నిధులు బడ్జెట్ లో పెట్టలేదని కూడా ప్రతిపక్షం విమర్శిస్తోంది. దీని బట్టి ఈ పథకానికి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షం అనుమానం వ్యక్తం చేస్తుంది.